POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 6:25 pm Posted by : POLITICAL POWER

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యుగంధర్ రెడ్డికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలింపు.. బాధితుడికి అండగా నిలిచిన మాజీ మంత్రి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: పెద్దమందడి / అడ్డాకుల మండలం పెద్దమునగల్ చెడు గ్రామానికి చెందిన యుగంధర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కొత్తకోటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెల్టూరు స్టేజ్ సమీపంలో గుర్తుతెలియని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంటనే స్పందించి బాధితుడికి అండగా నిలిచారు. తొలుత యుగంధర్ రెడ్డిని వనపర్తిలోని హైందవ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం అవసరమని భావించి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా దగ్గరుండి హైదరాబాద్‌కు పంపించారు. ఆపద సమయంలో స్పందించి బాధితుడికి వైద్య సహాయం అందించడంపై స్థానికులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజ ప్రకాష్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సయ్యద్ జమీల్, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.