రోడ్లపై క్షుద్ర పూజల కలకలం!

 రాజాపురం ఎస్సీ కాలనీలో భయాందోళనలు.. మూఢనమ్మకాలపై చర్యలేవీ? ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్న దుండగులను గుర్తించాలని గ్రామస్తుల డిమాండ్ ‌ అశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ, మేడపురెడ్డి నాగార్జున, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం ఎస్సీ కాలనీలో రహదారులపై కనిపిస్తున్న అనుమానాస్పద పూజా సామగ్రి స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రోడ్లపై నిమ్మకాయలు, పసుపు, కుంకుమ కలిపిన అన్నం, బొమ్మలు, నల్లటి వస్త్రాలు, ముగ్గులు కనిపిస్తుండటంతో ప్రజల్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు మహిళలు, వృద్ధులు భయపడుతున్నారని గ్రామస్తులు...