రౌడీషీట్ల రాజకీయం.. అధికారం మారితే టీడీపీ భవిష్యత్తు ఏంటీ? టీడీపీ కార్యకర్తలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్న చంద్రబాబు, లోకేష్ వైసీపీ అధికారంలోకి వస్తే.. చర్యకు ప్రతిచర్య ఉండదా..? అనాలోచిన నిర్ణయాలు, రాజకీయ కక్షసాధింపులతో కార్యకర్తలను ఇరకాటంలో పెడుతున్న లోకేష్
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై కేసులు, రౌడీషీట్ల వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. విజయవాడలో గతంలో నమోదైన కేసులు, నిరసనలకు సంబంధించి 51 మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ పోలీస్ కమిషనర్ అసాదారణ ఆదేశాలిచ్చారు. ఐదేళ్ల క్రితం నాటి కేసులో ఇప్పుడు రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని ఆదేశాలివ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి....