POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 6:29 pm Posted by : POLITICAL POWER

లంకసాగర్ క్రాస్ రోడ్డులో ఎస్సీ కమ్యూనిటీ భవనం భూమి వివాదం

ఆక్రమణల నుంచి కమ్యూనిటీ భవనాన్ని కాపాడాలని స్థానికుల విజ్ఞప్తి

ఎంపీ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం భూమిపై వివాదం

ప్రభుత్వం జోక్యం చేసుకుని స్థలాన్ని పరిరక్షించాలని స్థానికుల డిమాండ్

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 18 2026: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు లంకసాగర్ క్రాస్ రోడ్డులో భూమి సమస్యలు కొనసాగుతున్నాయి. 2006లో రేణుకా చౌదరి పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న సమయంలో ఎంపీ నిధులతో సర్వే నంబర్ 163/A/1లో ఎస్సీ కమ్యూనిటీ భవనం నిర్మించబడింది. అయితే, కొంతకాలంగా కొందరు స్థానికులు ఆ కమ్యూనిటీ భవనాన్ని ఆక్రమించుకుని, దానికి రహదారి కూడా లేకుండా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, భవనంలో ఇతరులను నివాసం ఉంచినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఆ స్థలాన్ని సత్తుపల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ స్థలంపై కోర్టులో కేసు వేసి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన భూమిలో కరెంట్ స్తంభాలు పాతిపెట్టి, కమ్యూనిటీ భవనానికి వెళ్లే దారిని కూడా లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ స్థలం వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత స్థలాన్ని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ఎస్సీ కమ్యూనిటీ భవనం ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించి, భవనానికి సరైన రహదారి ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.