POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 8:02 pm Posted by : POLITICAL POWER

లాభం చేకూర్చెందుకా.. కమిషన్లు రానందుకా వాడుకలోకి రాని మరుగుదొడ్లుఅధికారుల పర్యవేక్షణ లోపమే ఈ దుస్థితి

బిసి పొలిటికల్ జెఎసి వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు..

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 19 2026: మదనాపురం మండల కేంద్రంలో సామూహిక మరుగుదొడ్లను నిర్మించి 8 నెలలు కావస్తున్న వాడుకలోకి రావడం లేదని, బీసీ పొలిటికల్ జెఎస్సి వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బడికి నీ మహేందర్ నాయుడు ఆరోపించారు. మండల కేంద్రంలోని రైతు వేదిక,ప్రభుత్వ ఆసుపత్రి మధ్యలో ఉన్న ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర ప్రజలకు ఉపయోగ పడెందుకు స్తానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సహకారంతో మండలంలోని నాయకులు సామూహిక మరుగుదొడ్లను నిర్మించారు. కట్టడాలు అయిపోయి 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా అధికారులు సైతం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండటం పట్ల విధుల నిర్వహణలో ఏమాత్రం పర్యవేక్షణ ఉందో తెలుస్తుందన్నారు. నిత్యం రైతు వేదిక దగ్గర సర్వసభ్య సమావేశాలు, రైతుల మీటింగులు, ప్రభుత్వ కార్యాకలాపాల కార్యక్రమాలను ఎన్నో మార్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించినప్పటికీ.. పక్కనే ఉన్న సామూహిక మరుగుదొడ్లు ప్రజల ఉపయోగం పట్ల ఏ మాత్రం మెరుగ్గా ఉన్నాయో తెలియట్లేద అని విమర్శించారు. పురుషులకు, స్త్రీలకు విడివిడిగా మరుగుదొడ్లను కట్టి పైకి కనిపించేంత నిర్మాణాలను నాయకులు చేసినప్పటికీ కూడా వాడుకలో మాత్రం శూన్యంగా ఉండడం సిగ్గుచేటు అన్నారు. రైతు వేదిక, ఐకెపి మహిళా సమాఖ్య, ప్రభుత్వ ఆసుపత్రి, కేజీబీవీ, గోదాములు, ప్రభుత్వ పాఠశాలకు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఈ మరుగుదొడ్లు ఎందుకు కట్టి వదిలేసారని ప్రజలే దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలా ఉంటే స్వచ్ఛ భారత్ మిషన్ కి మచ్చగా మిగులుతుందని అధికారులు ఎందుకు చెల్లించలేకపోతున్నారో గుర్తుకు రాదా అన్నారు.కేవలం కమిషన్ల పర్వం కోసమే మరుగుదొడ్లు నిర్మించారు అని విమర్శించారు. వెంటనే ఉపయోగంలోకి వచ్చేటట్లు అధికారులు చూడాలి డిమాండ్ చేశారు లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కు అధికారులపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.