పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 14 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద లేబర్ మొబిలైజేషన్‌ను మరింత పెంచే అంశంపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనుల్లో కార్మికుల భాగస్వామ్యాన్ని ఎలా పెంచాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంజిఎన్ఆర్‌ఈజీఎస్ సిబ్బంది హాజరయ్యారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులుచర్చించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ విజయభాస్కర్, ఎంపీడీవో పరిణత, ఎంపీవో పుష్ప, ఏపీవో సురేష్ పాల్గొని పథకం అమలు, కార్మికుల నమోదులు, పనుల నిర్వహణ తదితర అంశాలపై సూచనలు చేశారు.