లోన్‌ యాప్‌ సైబర్‌ నేరగాళ్ల వేధింపులు

  అవసరానికి రుణమంటూ నమ్మించి.. ఆపై డబ్బుల కోసం వేధింపులు బిక్కవోలు: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలో లోన్‌ యాప్‌ సైబర్‌ నేరగాళ్ల వేధింపులు కలకలం రేపుతున్నాయి. అవసరానికి రుణం ఇస్తామంటూ నమ్మించి.. రుణం తీసుకున్న అనంతరం వివిధ రకాల పేర్లతో అదనంగా డబ్బులు చెల్లించాలంటూ రాత్రింబవళ్లు ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లతో వేధిస్తున్నారని గ్రామానికి చెందిన మహబూబ్‌ బాషా దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అవసరం ఉండటంతో లోన్‌ యాప్‌ ద్వారా డబ్బులు తీసుకున్నామని, అయితే ఆ తర్వాత మరిన్ని డబ్బులు...