POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 3:22 pm Posted by : POLITICAL POWER

వందల కోట్ల ఎన్ ఎస్ పి భూములు స్వాహా.. పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమా?

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్ జూన్ 05 2026: కండ్ల ముందే వందల కోట్ల రూపాయల విలువ చేసే ఎన్‌ఎస్‌పి ( ఎన్ ఎస్ పి ) భూములు అక్రమణకు గురవుతున్నా, ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి,పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ అన్న చందంగా.. పేద ప్రజలు తలదాచుకునే గుడిసెలపైకి బుల్డోజర్లు ప్రయోగించే అధికారులు, బడా బాబుల అక్రమ నిర్మాణాల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు,ఎన్‌ఎస్‌పి భూములను అక్రమించి కన్వెన్షన్ సెంటర్లు, బహుళ అంతస్తుల వ్యాపార సముదాయాలు,నివాస గృహాలను నిర్మించి కోట్ల రూపాయలు గడిస్తున్నా యంత్రాంగం మౌనం వహిస్తోంది.ఒక అధికార పార్టీ నాయకుడు ఏకంగా పార్క్ స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ఫెన్సింగ్ వేయించడం విశేషం, అదే విధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ డివిజన్ ఎల్ బి నగర్ ప్రాంతంలో పది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి విషయంలో ఇద్దరు అధికార పార్టీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ స్థానిక కార్పొరేటర్ కాలు విరగ్గొట్టే వరకు వచ్చింది.ఈ విషయంలో మొత్తం గొడవకు కారణమైన వ్యక్తి వెనుక ఖమ్మం రాజకీయాల్లో చక్రం తిప్పే వైరా నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు నిందితులపై కేసులు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపించాయి,ఈ మొత్తం వ్యవహారంలో ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తుండడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం గొడవకు కారణమైన వ్యక్తిని మరో మంత్రి అనుచరుడంటూ సదరు నాయకుడు తన అనుయాయులతో తప్పుడు ప్రచారం చేయించడం గమనార్హం,ఇన్ని అక్రమాలు కండ్ల ఎదురుగా జరుగుతున్న పట్టించుకోకుండా సదరు పెద్దలు ఇచ్చే ముడుపుల మత్తులో అధికారులు జోగుతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి…..

రఘునాథపాలెంలో విచ్చలవిడి ‘మట్టి’ దోపిడీ: వందల కోట్ల చేతులు మార్పిడి…రఘునాథపాలెం మండలంలో మట్టి గుట్టలు మాయమవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇద్దరు అధికార పార్టీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఈ మట్టి మాఫియా నడుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ దందాలో నెలకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం,రఘునాథపాలెం మండలంలో నడుస్తున్న ఏ ఒక్క మట్టి క్వారీకి కూడా ప్రభుత్వ అనుమతులు లేవని స్పష్టమవుతోంది. మైనింగ్, రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే.. జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరు చెప్పి తప్పించుకుంటుండటం విశేషం.తాజాగా మండలంలోని ఒక చెరువు మట్టిని ఏటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇటుక బట్టిలకు తరలిస్తుండగా, అడ్డుకున్న ఒక స్థానిక రైతుతో పాటు ఇరిగేషన్ ఏఈ (ఏ ఈ ), ఒక లష్కర్‌పై మట్టి మాఫియా దారుణంగా దాడి చేసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదనేది ప్రధాన ఆరోపణ.ఈ నేపథ్యంలో మట్టి మాఫియా తరుపున ఇద్దరు మంత్రి ప్రధాన అనుచరులు రంగంలోకి దిగి కేసు రాజీ చేసుకోమంటూ బాధితులపై ఒత్తిడి తేవడమే కాకుండా పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ అధికారులను తీవ్రంగా బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ ఒత్తిళ్లతోనే స్థానిక పోలీసులు తమ పిర్యాదును పట్టించుకోవడం లేదంటూ బాధితులు పోలీస్ కమిషనర్ ను కలిసి తమ గోడు చెప్పుకుంటామని న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు….

బల్లేపల్లిలో గుట్టలకే గుండు కొట్టేసిన మట్టి మాఫియా ‘కింగ్ పిన్’….

బల్లెపల్లి రెవెన్యూ పరిధిలోని 42:00 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టను మెడికల్ కాలేజ్ భూ నిర్వాసితులకు ఇచ్చే ప్లాట్లను సదును చేసే పేరుతో అక్రమ మైనింగ్ వ్యవహారంలో కోట్ల రూపాయలు జరిమానా విధించినప్పటికీ చెల్లించకుండా తప్పించుకుంటూ బినామీ పేర్లమీద మైనింగ్ అనుమతులు పొందుతున్న ఓ మట్టి “మాఫియా కింగ్ పిన్”కు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి టెండర్లు పిలవకుండా అక్రమంగా అనుమతులు ఇవ్వడంతో వందల కోట్ల విలువైన లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని ఆరు నెలల పాటు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నాడు.ఈ విషయంలో ముగ్గురు అధికార పార్టీ నాయకులు,గత ఆర్డీవో,ఎమ్మార్వో తోపాటు మైనింగ్ శాఖలో ఒక జిల్లా స్థాయి అధికారి అన్ని తానై నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి,కంచె చేను మేసినట్లు ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపితే ప్రభుత్వ ఆస్తులు కాపాడేవారంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, అంతే కాకుండా 32 మంది భూ నిర్వాసితులకు ప్లాట్లు ఇవ్వడానికి 42 ఏకరకాలను సదును చేయాల్సిన అవసరం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు…..

నాడు గర్జన.. నేడు మౌనం: మంత్రి తుమ్మల హామీ ఏమైంది?

గత ఎన్నికల ప్రచార సమయంలో.. ఖమ్మంలో ల్యాండ్, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, భూకబ్జాలు, రౌడీయిజాన్ని అణచివేస్తామని ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఖమ్మం ప్రజలకు హామీలు ఇచ్చారు. గత ప్రభుత్వ నేతలు గుట్టలకు గుండు కొట్టిస్తున్నారని, తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ మాఫియా పీచమనుచుతామని ప్రజలకు మాటిచ్చారు.కానీ, అధికారం దక్కిన తర్వాత సీన్ రివర్స్ అయింది.కొంతమంది అధికార పార్టీ నేతలే ల్యాండ్, మట్టి మాఫియాను అక్కున చేర్చుకోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.నలబై నాలుగు ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుచ్చర్యలను సహించని వ్యక్తిగా ప్రజల్లో మంచి పేరు ఉన్నప్పటికీ నాటి హామీలను మరిచారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నేడు స్వయంగా అధికార పార్టీ నాయకులే ఈ దందాల్లో కీలక పాత్ర పోషిస్తున్నా మంత్రి తుమ్మల ఎందుకు మౌనం వహిస్తున్నారని ఖమ్మం ప్రజలు నిలదీస్తున్నారు.ఖమ్మం నగర భవిష్యత్తును, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇకనైనా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని, మట్టి మాఫియాపై, భూ కబ్జాకోరులపై కఠిన వైఖరి అవలంబించాలి. సొంత పార్టీ వారైనా సరే ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఖమ్మం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నగర వాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు….