POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 1:39 pm Posted by : POLITICAL POWER

వచ్చే ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో విద్యార్థులు 100.శాతం పాస్ అయ్యే విధంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి

– జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 01. 2026.
రాబోయే పదో తరగతి వార్షిక పరీక్షల్లో వనపర్తిజిల్లాఉత్తమఫలితాలుసాధించేలాప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలో నిర్వహించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల (జీహెచ్‌ఎంలు) సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పదో తరగతి విద్యార్థుల పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక బోధన కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై  పలు సూచనలు చేశారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టులను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించిన ప్రత్యేక అధ్యయన మెటీరియల్ (స్టడీ మెటీరియల్) వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆగస్టు 12వ తేదీలోగా సంబంధిత ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక స్టడీ మెటీరియల్ పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆ పరీక్షల ఫలితాల ఆధారంగా సబ్జెక్టుల్లో వెనుకబడిన (స్లో లెర్నర్స్) విద్యార్థులను గుర్తించి వారి జాబితా సిద్ధం చేయాలని తెలిపారు. గుర్తించిన విద్యార్థులకు ప్రత్యేక స్టడీ మెటీరియల్ ఆధారంగా మూడు నెలల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, ఆయా సబ్జెక్టుల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ బలహీనతలను అధిగమించేలా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా, తరచూ పరీక్షలు నిర్వహిస్తూ వారి పురోగతిని అంచనా వేయాలని, అవసరమైన చోట అదనపు బోధన అందించాలని కలెక్టర్ తెలిపారు. వచ్చే ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో గణితం, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టుల్లో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండాప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని ఆదేశించారు.అనంతరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై సమీక్షించిన కలెక్టర్, ప్రతి పాఠశాలలో గ్యాస్ కనెక్షన్లను తప్పనిసరిగా వినియోగించి పరిశుభ్రంగా, నాణ్యమైన ఆహారంవిద్యార్థులకుఅందేలాచర్యలుతీసుకోవాలనిప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.