POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 11:43 pm Posted by : POLITICAL POWER

*వడ్డెర ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.1.50 కోట్ల నిధులకు పరిపాలనా అనుమతి* వడ్డెర సామాజిక వర్గ ఆత్మగౌరవానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వo

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం

ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి గుంజ రేణుక నారాయణ హర్షం వ్యక్తం చేశారు.

వడ్డెర సామాజిక వర్గానికి హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో కేటాయించిన ఒక ఎకరం స్థలంలో వడ్డెర ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నెం.46, తేదీ 02-11-2026 ద్వారా రూ.1.50 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేయడం పట్ల ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

వడ్డెర ఆత్మగౌరవ భవనానికి రూ.1.50 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేయడం వడ్డెర సామాజిక వర్గ అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు

వడ్డెర సామాజిక వర్గానికి ఆత్మగౌరవ భవనం అనేది కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదని, అది తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వడ్డెర సమాజానికి ఆత్మగౌరవ ప్రతీక అని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. వడ్డెర సమాజ చిరకాల ఆకాంక్షను నెరవేర్చే దిశగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి వడ్డెర సమాజం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు

వెనుకబడిన తరగతుల సంక్షేమం, బీసీ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ, సహకారం, మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెర ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయం అమలుకు ఆయన సహకారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి ధన్యవాదాలు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సామాజిక వర్గాల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం అభినందనీయమని పేర్కొంటూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రభుత్వ బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు శ్రీ వి. హనుమంతరావు కి కృతజ్ఞతలు

బీసీ వర్గాల హక్కులు, అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వ బీసీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు శ్రీ వి. హనుమంతరావు సహకారం, సూచనలు, ప్రోత్సాహం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి గోగుల సరిత పాల్గొన్నారు

ఈ సందర్భంగా వడ్డెర ఆత్మగౌరవ భవనం సాధన కోసం వివిధ స్థాయిల్లో కృషి చేసిన జాతీయ వడ్డెర సంఘం జాతీయ కార్యదర్శి శ్రీ పిట్ల శ్రీధర్ , అఖిల భారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్ మంజల్కర్ , గన్నుదెబ్బ అధ్యక్షులు శ్రీ ఎత్తరి అంతయ్య , రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ స్టేట్ అబ్జర్వర్ దేరంగుల కృష్ణ , డిసిసి నాయకులు కుమార్ గారు, పాని పట్టు సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య , ఇతర వడ్డెర సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు,
శ్రీమతి గుంజ రేణుక నారాయణ
చైర్‌పర్సన్,
తెలంగాణ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్.