POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 4:03 pm Posted by : POLITICAL POWER

వనపర్తిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం, బి ఎల్ ఏ లకు శిక్షణ కార్యక్రమం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 7 2026:వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన పట్టణ, మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటు బూత్ లెవల్ ఏజెంట్స్ (బి ఎల్ ఏ ) లకు ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం (జూన్ 8) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు వనపర్తిలోని ఆర్జీ గార్డెన్‌లో జరగనుంది.ఈ కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయనుండగా, పార్టీ బలోపేతం మరియు ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే బి ఎల్ ఏ లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమానికి వనపర్తి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, బి ఎల్ ఏ లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మార్కెట్ యార్డ్ ప్రతినిధులు, సింగిల్ విండో అధ్యక్షులు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, అనుబంధ సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు జిల్లా డీసీసీ కార్యాలయం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.