వనపర్తిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: వనపర్తి పట్టణంలో శనివారం పలు కార్యక్రమాల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ముందుగా వనపర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ రుచులు” హోటల్ ప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో ఇటువంటి హోటల్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హోటల్ నిర్వాహకులు సర్వేశ్వర్ రెడ్డిని అభినందిస్తూ, అన్నింటికంటే మించిన దానం...