గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకునేందుకు ఆహ్వానం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 10 2026: వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం లభించడం వనపర్తి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. సమాజంలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, యువతను రక్తదానం వైపు ప్రోత్సహించడంలో ఎమ్మెల్యే చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేక మంది రోగులకు ప్రాణదానంగా నిలిచే రక్తాన్ని అందించగలిగారు. రక్తదాన ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో ఎమ్మెల్యే నాయకత్వం, యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు చేసిన కృషి విశేష ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో గౌరవనీయ గవర్నర్ చేతుల మీదుగా అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆహ్వానం అందడం మరింత గర్వకారణంగా మారింది. మానవతా విలువలను చాటిచెప్పే ఈ గుర్తింపు వనపర్తి ప్రజలందరికీ ఆనందాన్ని కలిగిస్తుండగా, భవిష్యత్తులో కూడా రక్తదాన ఉద్యమాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తూ ప్రాణాలను కాపాడే సేవా కార్యక్రమాలకు కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన, యువకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.