వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి దక్కిన అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం

గవర్నర్ చేతుల మీదుగా పురస్కారం అందుకునేందుకు ఆహ్వానం పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 10 2026: వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి అత్యున్నత రక్తదాత ప్రోత్సాహక పురస్కారం లభించడం వనపర్తి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. సమాజంలో స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, యువతను రక్తదానం వైపు ప్రోత్సహించడంలో ఎమ్మెల్యే చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో...