POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 8:55 pm Posted by : POLITICAL POWER

వనపర్తి జిల్లా అభివృద్ధిలో మరో ముందడుగు..

ప్రజలకు మరింత చేరువగా బ్యాంకింగ్ సేవలు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలను ప్రారంభించిన

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: వనపర్తి పట్టణంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన బ్యాంకు శాఖను ప్రారంభించి, బ్యాంకు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… వనపర్తి జిల్లాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు కావడం సంతోషకరమని, జిల్లాలో ప్రారంభమైన తొలి సెంట్రల్ బ్యాంక్ శాఖగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, రైతులు, వ్యాపారులు, మహిళలు, యువతకు ఆర్థికంగా తోడ్పడేందుకు ఈ శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకు ద్వారా అందించే వ్యవసాయ రుణాలు, విద్యా రుణాలు, గృహ రుణాలు, వాహన రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ప్రజలకు సులభంగా అందించాలని బ్యాంకు అధికారులను కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు, రుణ సదుపాయాలు అందేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వనపర్తి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా జిల్లాలో అవసరమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులకు సహకారం అందించాలని బ్యాంకు ఉన్నతాధికారులను ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. ప్రజలకు మెరుగైన ఆర్థిక సేవలు అందించడంతో పాటు, స్థానిక అభివృద్ధికి కూడా బ్యాంకు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు జోనల్ హెడ్ ఎం. పిచయ్య, రీజినల్ హెడ్ జి.ఎస్. చౌహాన్, వనపర్తి బ్రాంచ్ హెడ్ రామావత్ చంద్రు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి SLN రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, జిల్లా జర్నల్ సెక్రెటరీ బ్రహ్మంచారి, కౌన్సిలర్లు బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.