-మండప నిర్వాహకులారా.. స్టేషన్‌కు రండి!
-గణేష్ మండపాలకు పోలీసుల మార్గదర్శకం
-సోమవారం ఉదయం 10 గంటలకు వనపర్తి పోలీస్ స్టేషన్‌లో కీలక సమావేశం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: వనపర్తి పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు సోమవారం ఉదయం 10 గంటలకు వనపర్తి పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని వనపర్తి పోలీసులు విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఇతర అంశాలపై మండపాల నిర్వాహకులకు పోలీసులు సలహాలు, సూచనలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పట్టణంలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా హాజరై పోలీసు శాఖకు సహకరించాలని వనపర్తి ఎస్‌ఐ ఒక ప్రకటనలో కోరారు.