ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందజేతపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026:వనపర్తి మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్‌గా అడ్వకేట్ నందిమళ్ల త్రినాథ్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జారీ చేసిన నియామక పత్రాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా త్రినాథ్ ముదిరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు, మున్సిపల్ చైర్మన్‌కు, కౌన్సిల్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించిన న్యాయపరమైన అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి న్యాయపరమైన సహకారం అందిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. న్యాయబద్ధత, నిజాయితీకి ప్రాధాన్యతనిస్తూ తన బాధ్యతలను నిర్వర్తిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ జి. మధుసూదన్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్‌తో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. నూతనంగా నియమితులైన స్టాండింగ్ కౌన్సిల్ నందిమళ్ల త్రినాథ్ ముదిరాజ్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.