పోలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15 2026: వనపర్తి లైట్ అండ్ హెవీ మెకానికల్ యూనియన్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు జబ్బర్, అధ్యక్షులు పఠాన్ అయూబ్, ఉపాధ్యక్షులు యాదగిరి రావు, జనరల్ సెక్రటరీ కడారు రఘురాం, కోశాధికారి మహబూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు జావిద్ (ట్రాక్టర్), నసీం ఖాన్ (వాషింగ్), ముజ్జు (కార్)తో పాటు పలువురు యూనియన్ సభ్యులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.