వనపర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిద్దాం -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 03 2026: వనపర్తి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దాదాపు ఏడు కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...