POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 7:37 pm Posted by : POLITICAL POWER

వనుమలమ్మ అమ్మవారి అన్నసమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే10:

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి  నియోజకవర్గంలోని పోలమూరు గ్రామంలో వెలసిన గ్రామ దేవత శ్రీ వనుమలమ్మ అమ్మవారి వార్షిక అన్నసమారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతల పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసం, భక్తి ఎంతో గొప్పదని అన్నారు. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత పెరుగుతుందని తెలిపారు. పోలమూరు గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమం ఆదర్శప్రాయమని కొనియాడారు.
అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయగా, పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, గ్రామస్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.