POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 11:24 am Posted by : POLITICAL POWER

వన్నం బ్రహ్మయ్యకు అక్షరశ్రీ బిరుదు ప్రధానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ విశ్వసహితీ కళావేదిక ప్రథమ వార్షికోత్సవం తాడేపల్లిగూడెం నందు ఆదివారం అత్యంత వైభవో పేతoగా జరిగింది. ఈ కార్యక్రమం నందు పి.ఎన్.ఎం ఉన్నత పాఠశాల, జండా వీధి నెల్లూరు నందు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు,విశ్వసాహితి కళావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కవి,రచయిత వన్నం బ్రహ్మయ్య రచించిన *అక్షర వసంతం* కవితా సంపుటిని ద్వితీయ ఆవిష్కరణ చేసి సమీక్షించారు. మరియు వన్నం బ్రహ్మయ్య ని అక్షరశ్రీ పురస్కారంతో ఘన సత్కారం చేశారు. ప్రముఖ గజల్ గాయకులు శ్రీ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తక రచన అనేది మహాద్భాగ్యమని మన పరోక్షంలో కూడా మన రచించిన పుస్తకంలోని అంశాల మాధుర్యాన్ని అందరూ చర్చించి ముచ్చటించుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు విశ్వసాహితీ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కొల్లి రమావతి , తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ పూల త్రివిక్రమ్ , కవివర్యులు రసరాజు,గంటి మాణిక్యాలరావు, తిరుపతి జిల్లా విశ్వసాహితీ కళావేదిక అధ్యక్షులు అయినంపాకం గోపి కృష్ణారెడ్డి , తెలుగు అధ్యాపకులు అమ్మణ్ణి.తదితరులు పాల్గొన్నారు.