వరంగల్ ఎం జి ఎం ఆసుపత్రిలో దయనీయ పరిస్థితి ఆరోగ్య శ్రీ వార్డులో పై కప్పు పెచ్చులు ఊడి పడి ముగ్గురికి గాయాలు

వరంగల్, సెప్టెంబర్ 20:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారుతోంది. వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రిలో చోటుచేసుకున్న తాజా ఘటనే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడిపడి కింద ఉన్న రోగి, అతని సహాయకులు గాయాలపాలయ్యారు. అసలు...