వరంగల్ MGM వేదికగా సమ్మె శంఖారావం.. డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్త ఆస్పత్రి కార్మికుల సమ్మెకు పిలుపు! – 20 వేల మంది శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల హక్కుల పోరాటం – కనీస వేతనం ₹26,000 ఇస్తూ IFMISలో విలీనం చేయాలి: రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య డిమాండ్ – SPS మెడికల్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ మొదటి సన్నాహక సమావేశం ఘనం
పిపిఎన్ 9 టీవీ / పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి (నవంబర్ 06, 2026): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ మరియు సూపర్వైజర్ కార్మికుల భవిష్యత్తు కార్యాచరణకు వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రి వేదికైంది. SPS మెడికల్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి సన్నాహక సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య పాల్గొని రానున్న రోజుల్లో చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు. రెండు...