POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 November 2026, 8:31 pm Posted by : POLITICAL POWER

వర్షంలో ఆకలితో ఉన్నవారికి JSPW అన్నదానం

ఖమ్మం రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్లపై నిరుపేదలు, ప్రయాణికులకు ఆహారం పంపిణీ

పొలిటికల్ పవర్, ఖమ్మం, నవంబర్ 3: తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం నగరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, వృద్ధులు, ఇతరులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో JSPW (Justice for Social and Public Welfare) ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులతో పాటు నగరంలోని రోడ్లపై జీవనం సాగిస్తున్న నిరుపేదలు, అభాగ్యులు, ఆకలితో ఉన్న వారికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి భోజనం అందించాలనే మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప సేవ అని, సమాజంలో మానవత్వం, సేవాభావాన్ని పెంపొందించడమే JSPW సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని సభ్యులు వెల్లడించారు..ఈ కార్యక్రమంలో JSPW వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దపాక రమేష్‌తో పాటు వేముల సీతారామారావు, నామా వినోద్ కుమార్, మామిళ్లపల్లి నాగయ్య, మహమ్మద్ అజ్గర్, యర్ర నాగరాజు రెడ్డి, పులిపాటి నరసింహారావు, చెన్నబోయిన లక్ష్మీనారాయణ, గడదాసు రామారావు, మురికిపూడి బాబురావు, బత్తుల గోపాలరావు, పెద్దపొంగు శ్రీకాంత్, పెద్దపాక అన్వేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.