వర్షంలో ఆకలితో ఉన్నవారికి JSPW అన్నదానం
ఖమ్మం రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్లపై నిరుపేదలు, ప్రయాణికులకు ఆహారం పంపిణీ పొలిటికల్ పవర్, ఖమ్మం, నవంబర్ 3: తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం నగరంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు, వృద్ధులు, ఇతరులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో JSPW (Justice for Social and Public Welfare) ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉన్న ప్రయాణికులతో పాటు నగరంలోని...