*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాసాని పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి మానవతా దృక్పథంతో స్పందించారు. వర్షాల కారణంగా ప్రయాణాలు సాగించలేక ఇబ్బందులు పడుతున్న దూర ప్రాంత ప్రయాణికులకు ఆహార పొట్లాలు, బిస్కెట్లు, తాగునీటి బాటిళ్లను పంపిణీ చేశారు. భారీ వర్షాల సమయంలో ఆకలితో ఇబ్బందులు పడకుండా ప్రయాణికులకు తమ వంతు సహాయం అందించారు. అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల...