*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ఎ
న్నికల ముందు వెన్నలాంటి హామీలు.. అధికారంలోకి వచ్చాక ప్రజలను మరిచారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మంత్రులు, అధికారులు ‘వాటర్ మ్యాన్’ అంటూ పొగడ్తలతో ముంచెత్తడం విడ్డూరంగా ఉందని అన్నారు.
‘‘వాటర్ మ్యాన్ కన్నా ఎన్నికల ముందు ప్రజలకు వెన్నలాంటి మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను మర్చిపోతున్నందుకు చంద్రబాబు నాయుడిని ‘బటర్ మ్యాన్’ అని పిలిస్తే బాగుంటుంది’’ అని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు.
జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో తాగునీరు, సాగునీరు అందించి రైతులు, ప్రజలకు మేలు చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకే దక్కుతుందని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు పెరిగే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఆడబిడ్డకు శ్రీనిధి పథకం కింద నెలకు రూ.1,500 ఇస్తామని, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీలు ఇచ్చారని తెలిపారు.
ఒక్క చేతి వృత్తుదారుడికైనా ఒక్క పనిముట్టు ఇచ్చారా అని అన్నారు
సూపర్ సిక్స్ హామీలతో పాటు 600కు పైగా హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని శ్రీకాంత్ ఆరోపించారు.
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తామంటూ మరో కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని శ్రీకాంత్ అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
