— వెల్టూర్ లో ఘనంగా చిన్నారి జన్మదిన వేడుకలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 01 2026: పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ఆంజనేయులు –రజిత దంపతుల కుమార్తె చిన్నారి విఘ్నేశ్వరీ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకులు హాజరై చిన్నారి విఘ్నేశ్వరీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని కాంగ్రెస్ నాయకులు ఆకాంక్షించారు.జన్మదిన వేడుకల సందర్భంగా కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి చిన్నారి విఘ్నేశ్వరీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డిఎస్ మహేష్, దయ్యాల దాసు, వార్డు సభ్యులు నాగభూషణ్, మద్దూర్ వెంకటయ్య, అశోక్, బండి రాజు తదితరులు పాల్గొన్నారు.