POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 7:44 pm Posted by : POLITICAL POWER

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 16 2026: వినాయక చవితి పవిత్ర పండుగను పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల ముంధు ఎర్రపటు చెసినా ప్రథమ శ్రీ విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ గారు.ఈ సందర్బంగా శంకర్ గౌడ్ ను మరియు బైరోజు చంద్రశేఖర్ ను కౌన్సిలర్ చీర్ల చందర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తో కలసి సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ… సర్వ విఘ్నాలు తొలగించి సమస్త జనులకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆ విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నానని, వనపర్తి జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ప్రశాంతతతో విలసిల్లాలని స్వామివారిని వేడుకున్నానని తెలిపారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ఐక్యతతో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శామ్ సుందర్, నందిమల్ల రమేష్, శ్రీనివాస్ ,యుగందర్, సదానందం గౌడ్, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.