POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 7:51 pm Posted by : POLITICAL POWER

విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం మెరుగైన వసతులు అందేలాఅధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

– బాలికల సంక్షేమ గురుకులపాఠశాలకళాశాలను ఆకస్మికంగాతనిఖీచేసినఎమ్మెల్యే.జి.మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 10.2026.
విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి భోజనం, మెరుగైన వసతులు  అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని,దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోనిబాలికలసంక్షేమగురుకులపాఠశాల,కళాశాలనుఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం యొక్క నాణ్యత, పరిశుభ్రత ను పరిశీలించారు.అనంతరంవిద్యార్థినులతోఆత్మీయంగాముచ్చటిస్తూ, కళాశాలలోని మౌలిక వసతులను, భోజనంయొక్కనాణ్యతను,కళాశాలలోవసతికిసంబంధించినసౌకర్యాలుఎలాఉన్నాయనిఅడిగితెలుసుకున్నారు.ఈసందర్భంగాఆయనమాట్లాడుతూవిద్యార్థినులకు నాణ్యమైనవిద్యతోపాటుమంచిభోజనం, మెరుగైన వసతులు  అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సూచించారు.బాలికల విద్య, సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని,విద్యార్థులకునాణ్యమైనభోజనాన్ని అందించాలని ఆయన కోరారు.తదనంతరం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను పరిశీలించి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను, అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మదనాపురం మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాపయ్య గారి కృష్ణారెడ్డి, చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు ఎన్ జే.బోహెజ్, అబ్దుల్ నబీ, అఖిల సుభాష్, మాజీ సర్పంచ్ శివరాములు, మతిన్, కో ఆప్షన్ సభ్యులు కొండారెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ , శ్యాంసుందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.