– నాయకత్వం నేర్చుకోండి.. సైబర్ నేరాలను అడ్డుకోండి.బాలలభద్రతకుఅండగానిలవండి, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, పిరమిడ్స్ ప్రదర్శనలు,
– బాలల రక్షణ ఫోక్సో చట్టాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి, ప్రతి విద్యార్థి సైబర్ భద్రత రాయబారిగా మారాలి. కె.పి.ఎస్ లో ఘనంగా విద్యార్థుల నాయకత్వ పట్టాభిషేక మహోత్సవం,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.09.2026.వనపర్తిజిల్లాకొత్తకోటమండలకేంద్రంలోనికొత్తకోటపీపుల్స్.హైస్కూల్(కె.పి.ఎస్.)లోమంగళవారంవిద్యార్థులనాయకత్వపట్టాభిషేకమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికిముఖ్య అతిథిగావనపర్తిజిల్లాఎస్పీ.సునితరెడ్డిహాజరయ్యారు. పాఠశాలకు చేరుకున్న జిల్లా ఎస్పీ గారికి కె.పి.ఎస్. పాఠశాల పరేడ్ బృందం ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, అద్భుతమైన పిరమిడ్స్ ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులప్రతిభనుచూసిఎస్పీ.అభినందించారు.విద్యార్థుల్లోనాయకత్వస్ఫూర్తి,క్రమశిక్షణ,బాధ్యతాయుత ఆలోచనా విధానం, సేవాభావం, ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్నికైన విద్యార్థులకు జిల్లా ఎస్పీ. సునితా రెడ్డి చేతుల మీదుగా పట్టాభిషేకంనిర్వహించి నాయకత్వ బాధ్యతలను అందించారు. అనంతరం విద్యార్థులందరితో లీడర్‌షిప్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఎస్పీ. మాట్లాడుతూ విద్యార్థి దశ అనేది వ్యక్తిత్వ వికాసానికి,భవిష్యత్,నాయకత్వానికిపునాది వేసే అత్యంత కీలకమైన దశని నాయకత్వం అంటే కేవలం ఒక పదవి లేదా హోదా కాదని, ఇతరులను ముందుకు నడిపించే బాధ్యతతో పాటు సమాజం పట్లసేవాభావంకలిగిఉండటమేనిజమైననాయకత్వమని చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యత, ఆత్మవిశ్వాసం, ఇతరులను గౌరవించే తత్వం,సేవాభావంవంటివిలువలనుఅలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో నేర్చుకునే విద్య కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా, మంచివ్యక్తిత్వంతోకూడినబాధ్యతాయుతపౌరులుగా ఎదగడానికి ఉపయోగపడాలని అన్నారు.విద్యార్థులు తమలోని ప్రతిభను గుర్తించి,లక్ష్యాలనునిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని, వైఫల్యాలనుచూసి నిరుత్సాహపడకుండా వాటినుంచిపాఠాలునేర్చుకుని విజయాన్నిసాధించాలనిఎస్పీ.సూచించారు.భవిష్యత్తులో దేశానికి, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగాఎదిగిఆదర్శంగానిలవాలనిఆకాంక్షించారు.అదేవిధంగా ప్రస్తుత కాలంలో విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని ఎస్పీ తెలిపారు. అనుమానాస్పద లింకులు, తెలియని యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడి ఆఫర్లు, సోషల్ మీడియాలో వచ్చే నకిలీ ప్రకటనలు పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఎవరైనాఫోన్ చేసి లేదా మెసేజ్ ద్వారా ఓటీపీ, ఏటీఎం/బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు,వ్యక్తిగతసమాచారాన్నిఅడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ప్రముఖుల పేర్లు, ఫొటోలు ఉపయోగించి సోషల్ మీడియాలోవచ్చేపెట్టుబడిఆఫర్లనుధృవీకరించకుండా నమ్మవద్దని సూచించారు.పాఠశాలలో నేర్చుకున్న సైబర్,భద్రతఅంశాలనువిద్యార్థులుతమతల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలకు తెలియజేసి వారిలో కూడా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి విద్యార్థి తన కుటుంబానికి, గ్రామానికి, సమాజానికి “సైబర్ భద్రత రాయబారి”గా మారాలిని ఎస్పీ పిలుపునిచ్చారు.బాలల భద్రత విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పిల్లలపై లైంగిక వేధింపులు, దుర్వినియోగం, అనుచితప్రవర్తన వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని పిల్లలకు “గుడ్ టచ్–బ్యాడ్ టచ్”పై అవగాహన కల్పించడంతో పాటు, తమకుఎదురయ్యే అసౌకర్యకరమైన లేదాఅనుమానాస్పదపరిస్థితులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలతోవెంటనేపంచుకునేధైర్యాన్నిపెంపొందించాలనిసూచించారు.బాలలపైలైంగికనేరాలనునిరోధించేందుకుఅమలులోఉన్నఫోక్సో,చట్టంగురించివిద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులుప్రాథమికఅవగాహన కలిగిఉండాలనిఅన్నారు.బాలలరక్షణకుసంబంధించినఅంశాల్లోప్రతిఒక్కరూబాధ్యతాయుతంగావ్యవహరించాలని, పిల్లల భద్రతకుముప్పుకలిగించేఘటనలు కనిపించినప్పుడుసంబంధితఅధికారులకుసమాచారం అందించాలని సూచించారు. బాలలభద్రతకేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. కుటుంబం, పాఠశాల, సమాజం మొత్తం కలిసి నిర్వహించాల్సిన బాధ్యతని ఎస్పీ పేర్కొన్నారు. విద్యార్థులు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను కూడా గౌరవించాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ఎస్పీ సూచించారు.ఈ సందర్భంగాపాఠశాలప్రిన్సిపల్ శ్రీమతి కృష్ణవేణి, చైర్మన్ శ్రీ ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ చంద్రహాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంఎంతోస్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, బాధ్యత, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.అనంతరం పాఠశాల యాజమాన్యం జిల్లా ఎస్పీ సునితా రెడ్డి, ఐపీఎస్ ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కొత్తకోట సీఐ ఓ.డి. రమేష్, కొత్తకోట ఎస్సై. విక్రమ్, శ్రీరంగాపూర్ ఎస్సై. హిమబిందు, పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి, చైర్మన్. ఎద్దుల రాజవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ చంద్రహాస్, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.







