– అమ్మ, సోదరుడు జ్ఞాపకార్థం విద్యార్థులకు బూట్లు, పెన్ను, పెన్సిల్స్, స్వీట్లు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి
పోలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగుదినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్. వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్17.2026.
విద్యార్థులు మంచి చదువులు చదువుకోండి మీకు అండగా నేను ఉంటా ఎప్పుడు ఎ అవసరం వచ్చిన నా దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరించే దిశగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి తల్లి పద్మమ్మ, సోదరుడు డాక్టర్ వెంకట్ రంగారెడ్డి గారి జ్ఞాపకార్ధంగా బూట్లు, పెన్నులు, పెన్సిల్స్, స్వీట్లు, రిటైర్డ్ ఉపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ తో కలిసి పంపిణి చేశారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతియేటా పాఠశాలలో బూట్లు అందజేస్తామని తెలిపారు. ఇంకా పాఠశాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని నా దృష్టికి తెచ్చారు అవి కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించి వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యబుద్దులు నేర్పుతున్న ఉపాధ్యాయులను రావుల సార్ గారు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కానాయపల్లి వాకింగ్ గ్రూప్ సభ్యులకు యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యాదయ్య సాగర్, గ్రామ సర్పంచ్ బొంతం శిరీష సాయి, ఉప సర్పంచ్ అంజి నాయక్, మాజీ వైస్ ఎంపీపీ వడ్డే శ్రీనివాసులు, వార్డు సభ్యులు కొత్త వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ బాజ గిరన్న, ఉద్యమకారులు శేఖర్ గౌడ్, నక్కల శాంతన్న, వెంకటేష్ సాగర్, అంజన్న, గోపాల్ రెడ్డి, రవీందర్ గౌడ్, గ్రామ అధ్యక్షులు హోటల్ రాజు, బక్క గోవర్ధన్, డీలర్ శ్రీను, కొత్తకోట బాలయ్య, భీమన్న, ఉప్పరి శ్రీను, దారమోని నాగరాజు, దారమోని మొగులయ్య, ఎర్ర వెంకటయ్య, పెద్ద కుర్మయ్య, రాజు, నర్సింహా, వాకిటి శ్రీను, శేఖర్, మన్యం, డీకే లక్ష్మణ్, గొల్ల రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.