– తెలియని లింకులు క్లిక్ చేయొద్దు ఓ టి పి, పిన్, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పొద్దు, ముఖం కనిపిస్తే నమ్మొద్దు వ్యక్తుల నిజమైన గుర్తింపును నిర్ధారించుకోండి,
– ప్రతి విద్యార్థి సైబర్ అవగాహన కలిగి కుటుంబం, సమాజాన్ని అప్రమత్తం చేయాలి, వినాయక చవితి సందర్భంగా సైబర్ భద్రత అవగాహన పోస్టర్ ఆవిష్కరణ,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 02.2026.డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు అడ్డుకట్టవేయడంలోఅవగాహనతో కూడినజాగ్రత్తలేప్రధానఆయుధాలనివనపర్తిడిసిఆర్బి డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు.వనపర్తి జిల్లా ఎస్పీ సునితరెడ్డిఐపీఎస్,ఆదేశాలమేరకుబుధవారంపెద్దమందడి మండలం మోజర్లలోని ప్రభుత్వ హార్టికల్చర్ కళాశాలలో డిసిఆర్బి డీఎస్పీ బాలాజీ నాయక్, సైబర్ క్రైమ్ ఎస్సై రవిప్రకాష్ పెద్దమందడి ఎస్ఐ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో“సైబర్,జాగ్రత్తదివాస్”కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఈసందర్భంగావినాయకచవితిపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన “వినాయకుడు మనకు నేర్పే సైబర్ జాగ్రత్తలు” అనే సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్‌ను డిసిఆర్బి డీఎస్పీ బాలాజీ నాయక్ ఆవిష్కరించారు. వినాయకుడి ప్రతిరూపం ద్వారా సైబర్ నేరాల పట్ల ప్రజలకు, ముఖ్యంగా యువతకు సులభంగా అర్థమయ్యేలా రూపొందించినఈఅవగాహనపోస్టర్‌లోనిసందేశాలను విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ నాయక్ మాట్లాడుతూ“సైబర్ ప్రపంచంలో అప్రమత్తతే రక్షణ. ఒక్క చిన్న నిర్లక్ష్యం భారీ ఆర్థిక నష్టానికి, వ్యక్తిగత సమాచార దుర్వినియోగానికి కారణమవుతుంది. ఆలోచించి క్లిక్ చేయండిజాగ్రత్తగా షేర్ చేయండి.. సురక్షితంగా ఉండండి” విద్యార్థులకు సూచించారు.ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని,ముఖ్యంగావిద్యార్థులు,యువతఆన్‌లైన్ కార్యకలాపాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.విద్యార్థులు తప్పనిసరిగా పాటించాల్సిన సైబర్ జాగ్రత్తలు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మి వ్యక్తిగత, బ్యాంకింగ్,వివరాలనువెల్లడించవద్దు.అనుమానాస్పద లింకులు, వెబ్‌సైట్లు, మెసేజ్‌లను క్లిక్ చేసే ముందు వాటి నిజస్వరూపాన్ని నిర్ధారించుకోవాలి.తక్కువ సమయంలో అధిక లాభాలు, బహుమతులు, ఉద్యోగాలు, పెట్టుబడులపేరుతోవచ్చేఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మవద్దు.ఓ టి పి, పిన్, పాస్‌వర్డ్, బ్యాంక్ ఖాతా, ఎ టియం /క్రెడిట్ కార్డు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు.తెలియని యాప్స్, ఫైళ్లు, లింకులను డౌన్‌లోడ్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలి.సోషల్ మీడియా లేదా వీడియో కాల్స్‌లో పరిచయమైన వ్యక్తుల పేరుతో వచ్చే అభ్యర్థనలను వెంటనే నమ్మకుండా వారి నిజమైన గుర్తింపును నిర్ధారించుకోవాలి.ముఖం కనిపిస్తే నమ్మొద్దు.. గుర్తింపును నిర్ధారించుకోండి” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. తప్పుడు వార్తలు, ఫేక్ లింకులు, అనుమానాస్పద మెసేజ్‌లను ఇతరులకుఫార్వర్డ్,చేయకుండాముందుగానిజానిజాలను తెలుసుకోవాలి. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లను ఏర్పాటుచేసుకొని,సాధ్యమైన చోటరెండుదశలభద్రత(TwoFactorAuthentication)ను వినియోగించాలి. సైబర్ నేరం జరిగిన తర్వాత బాధపడటం కంటే.. జరగకముందే జాగ్రత్త పడటం మేలు” అని డీఎస్పీ తెలిపారు. విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజంలోని ఇతరులను కూడా అప్రమత్తం చేయాలని సూచించారు.సైబర్ నేరానికి గురైనప్పుడు భయపడకుండా వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగేసైబర్ నేరాలపైమరింతసమాచారం,ఫిర్యాదుకోసంwww.cybercrime.gov.inవెబ్‌సైట్‌నువినియోగించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిసిఆర్బి డీఎస్పీ బాలాజీ నాయక్, సైబర్ క్రైమ్ ఎస్సై రవిప్రకాష్, పెద్దమందడి ఎస్సై జలంధర్ రెడ్డి, షీ టీం ఎస్సై అంజద్, ప్రభుత్వ హార్టికల్చర్ కళాశాల ప్రిన్సిపాల్, డా,,వీణజ్యోషి అధ్యాపకులు, సైబర్ పోలీస్ సిబ్బంది విజయ్ కుమార్, లోకేష్, పవణ్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
