పొలిటికల్ పవర్ ప్రతినిధి: సత్తుపల్లి
*సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ప్రేరణాత్మక శిక్షణ అందించిన ఇన్స్పైర్ అండ్ ఇగ్నిట్ ఫౌండేషన్ బృందానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.*
ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యార్థులకు అందుతున్న ఈ శిక్షణల ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను ముఖ్యమంత్రి గారికి వివరించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం, లక్ష్యసాధనపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణ తరగతులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించాల్సిన అవసరం ఉందని కోరారు.
విద్యార్థులలో మార్పు తీసుకురావడానికి, వారి భవిష్యత్‌ను మరింత బలంగా తీర్చిదిద్దడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
*విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయడం..*
*సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నిరంతర కృషి.*