POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 12:05 am Posted by : POLITICAL POWER

విద్యావైతాళ్లికుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి…

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :

మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం నేటి యువతకు ఆదర్శనియమని జిల్లా అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ అన్నారు. 138వ జయంతి వేడుకలను హాజరై మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి,మహనీయునికి ఘనంగానివాళులర్పించారు.

విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ప్రతి ఒక్కరికీ సమాన విద్యావకాశాలు కల్పించడం, సామాజిక న్యాయం, మతసామరస్యం, సమాన హక్కుల సాధన కోసం విశేష కృషి చేశారని పేర్కొన్నారు.

మౌలానా అబుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, విద్య ద్వారా సమాన అవకాశాలు కల్పించడం, సామాజిక సమానత్వం, సమగ్ర అభివృద్ధిని సాధించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ, జిల్లా రెవిన్యూ అధికారి నాగలక్ష్మి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, శ్రీరాములు, వెంకటేశ్వర్లు, అప్పారావు, దామోదర్, శ్రీనివాస్ యాదవ్, ఎం ఏ పిరోజ్, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.