POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:05 pm Posted by : POLITICAL POWER

విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఎందుకు వైదొలగాలి

–  నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ పస్ట్ ఇస్తున్నందుకా, టీచర్ల నియామకం, పదోన్నతులు సక్రమంగా నిర్వహించినందుకా, ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా ఎందుకు రాజీనామా చేయాలి,

– దేవరకద్ర శాసన సభ్యులు  జి. మధుసూదన్ రెడ్డి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 31.2026.

ముఖ్య మంత్రిగా రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రజా పాలన కొనసాగిస్తూనే విద్య శాఖ మంత్రిగా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డి విద్యాశాఖకు రాజీనామా
చేయాలా అంటూ బిఆర్ఎస్ పార్టీని ఎమ్మేల్యే విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఎందుకు వైదొలగాలని మధుసూదన్ రెడ్డి  గురువారం ఒక ప్రకటన లో  ప్రశ్నించారు.ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా,నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నందుకా,ఎందుకు రాజీనామా చేయాలని  ఎమ్మేల్యే  జి. మధుసూదన్ రెడ్డి భారస నాయకులను సూటిగాప్రశ్నించారు.టీచర్ల నియామకం,పదోన్నతులుసక్రమంగానిర్వహించినందుకా,ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకా, విద్యార్థులకు స్కిల్స్ అందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీఏర్పాటుచేసినందుకాఎందుకుమీరుచేయనిసంక్షేమాన్నిఅందిస్తున్నందుకా ఎందుకు అని ఎమ్మేల్యే జి. మధుసూదన్ రెడ్డి  బిఆర్ఎస్ నాయకులను నిలదీశారు.విద్య నైపుణ్యం కాదు విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది .ఇంగ్లీష్ ఒక్కటేముఖ్యమనుకుంటుంటే చైనా ప్రపంచాన్ని ఎలా శాసిస్తోంది.25 ఏళ్లు అమెరికా వైపు చూశాం… ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలపై ఆ దేశాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కావున ముఖ్యమంత్రి ఆదిశగా అడుగులువేయాలన్నారు.12 వ.తరగతితర్వాతవిద్యార్థికిప్రపంచంపైసంపూర్ణఅవగాహనఉండాలి.విద్యార్థుల్లోఆఅవగాహనపెంపొందిచాల్సిందిఉపాధ్యాయులేఅనిసూచించారు.ఉపాధ్యాయులకునేనుఒకటేసూచనచేస్తున్నా,ఉపాధ్యాయులసమస్యలనుపరిష్కరించేబాధ్యతప్రజాప్రభుత్వానిది,ఉపాధ్యాయ సంఘాలు మీ సమస్యలపై కాదు. విద్యార్థుల సమస్యలపై కొట్లాడండి .మనమందరం కలిసి ప్రపంచ దేశాలు మనవైపు చేసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుదామన్నారు ఎమ్మేల్యే  జి. మధుసూదన్ రెడ్డి . ఒక ఐదేళ్లు సమాజం కోసం, తరతరాల భవిష్యత్ ను మార్చేందుకు ప్రతిజ్ఞ పూనండి అన్నారు.దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పనిచేయండి.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషిచేయండన్నారు.