పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ ఆగష్ట 22 2026: అశ్వారావుపేట, కమలాపురం గ్రామంలోని గిరిజన సంక్షేమ వసతి పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సందర్శించారు. ‘నేను సైతం చేయూత–విద్యా యాత్ర’లో భాగంగా పాఠశాలలో నూతన బోరువెల్, అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే వారి సమస్యలు, భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య, మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.