POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 3:22 pm Posted by : POLITICAL POWER

విద్యా వారోత్సవాల్లో మద్దిగట్ల–మోజర్ల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 16 2026: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల సందర్భంగా “కళలు, హస్తకళలు” మరియు సాంస్కృతిక దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్ల విద్యార్థులు బంజారా నృత్యం, తెలంగాణ బోనాల పండుగకు సంబంధించిన సాంస్కృతిక నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కీమ్యా నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని ప్రారంభించారు. పెద్దమందడి మండల విద్యాధికారి మంజులత విద్యార్థుల నృత్య ప్రదర్శనలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థుల ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ ఇందిర, జిల్లా కో-ఆర్డినేటర్లు శేఖర్, మహానంది, నారాయణమ్మ, ప్రతాప్ రెడ్డి, జిల్లా పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష–ప్రధాన కార్యదర్శులు ఎం. బౌద్ధరెడ్డి, ఎస్. చంద్రశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, రేవల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి. ప్రసాద్, వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ సిబ్బంది, చిక్కేపల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శివయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, పుల్లయ్య, మధుసూదన్, చిన్నారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు డి. రణదీవ్, అమ్మపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశివర్ధన్ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాఠశాల తరఫున తప్పకుండా పాల్గొంటామని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు పేర్కొంటూ, కార్యక్రమానికి సహకరించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.