– ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, – దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 14.2026.
విద్యా వ్యవస్థనుబలోపేతంచేయడంలోప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని,ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు.సోమవారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలల్లోకార్పొరేట్,స్థాయివిద్యనుఅందించేందుజూలై 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోటలో పర్యటించి నూతనంగా నిర్మించినప్రభుత్వబాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాలప్రాంగణం,హెలిప్యాడ్,ఏర్పాట్లనుపరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డిమాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.రూ.1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనం నిర్మించగా, రూ.33.50 లక్షల వ్యయంతో పీఎం శ్రీ పథకం కింద లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ భవనాల నిర్మాణం పూర్తయిందని అన్నారు.ఈనిర్మాణాలను జూలై 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఈ పాఠశాలలో విద్యార్థినులు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ప్రస్తుతం ఆధునిక వసతులతో కూడిన భవనం అందుబాటులోకిరావడంవారికిఎంతోఉపయోగకరంగాఉంటుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్,ఇండియాఇంటిగ్రేటెడ్,రెసిడెన్షియల్,స్కూల్స్,ఏర్పాటుచేస్తున్నామని,వచ్చేవిద్యాసంవత్సరానికల్లా ఈ పాఠశాలలు పూర్తై సుమారు 2,500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తదితరవెనుకబడిన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందుబాటులోకి వస్తుందని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ ప్యానెల్,బోర్డులు,ఆర్టిఫిషియల్,ఇంటెలిజెన్స్(ఏఐ)ఆధారితవిద్యనుప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొంటూ, విద్యా వ్యవస్థను బలోపేతంచేయడంలోప్రభుత్వం ఎలాం
టి రాజీ పడబోదని స్పష్టం చేశారు. జూలై 15నముఖ్యమంత్రిముందుగామహబూబ్‌నగర్‌లోనిఅమరరాజాసంస్థకార్యక్రమంలోపాల్గొని,అనంతరం మధ్యాహ్నం కొత్తకోటకు చేరుకుని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలభవనాన్నిప్రారంభిస్తారని అన్నారు. అనంతరంవిద్యార్థులతోప్రత్యేకంగాముఖాముఖినిర్వహించి,ప్రభుత్వవిద్యలోతీసుకొస్తున్న సంస్కరణలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంపూర్తిగావిద్యార్థులకోసమేనిర్వహిస్తున్నందునరాజకీయప్రసంగాలకుతావులేకుండావిద్యాఅంశాలకేప్రాధాన్యంఇస్తామనిఎమ్మెల్యే,పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో గత ఏడాదితో పోలిస్తే విద్యార్థుల ప్రవేశాలు కూడా గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఏఎస్పీ వీరారెడ్డి, జెడ్పీ సీఈవో యాదయ్య, మదనాపూరం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ పల్లెపాగు ప్రశాంత్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి యాదవ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ పాపయ్య గారి పల్లవి కృష్ణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్, మాజీ జెడ్పిటిసి పి జె. బాబు,కిసాన్ రైతు సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు సలీం ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శలు పి. కృష్ణారెడ్డి , ఎన్ జె. బో హెజ్, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్లు జె. అఖిల తండ్రి సుభాష్, పుచ్చలపల్లి సుధ రామ్మోహన్ రెడ్డి, ఎన్ జే. బోయెజ్, భీమ చంద్ర కాంత్, పి. రవీందర్ రెడ్డి, మురలియదవ్, అస్మత్ ఖాన్ సలీం ఖాన్,కరాటే అబ్దుల్ నబి, సర్పంచుల సంఘం అధ్యక్షులు మాసన్న,మాజీ కో ఆప్షన్ సభ్యులు జే యం.మిషేక్, మూలమల్ల వెంకటేశ్వర్ రెడ్డి, ముజీబ్, కొత్తకోట మైనార్టీ అధ్యక్షులు ఎజాస్ అలీ, మాజీ వార్డు సభ్యులు నరేంద్ర సాగర్, దేవరకద్ర అసెంబ్లీ అధ్యక్షులు ముస్తఫా, పి. రవీందర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు మోహన్ రెడ్డి,రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ బి. శివరాములు, అమడ బాకుల మాజీ సర్పంచ్ జి శ్యాంసుందర్ గౌడ్, ఫిషర్ మ్యాన్ సందా వెంకటేష్, సింగల్ విండో డైరెక్టర్, సర్పంచ్ రామ్ లాల్ నాయక్,బూత్కూర్,సర్పంచ్,బంగారయ్య,గోకరయ్య,సాయిల్ యాదవ్,మహమ్మద్ ఖలీల్, ఎండి. ఫెరోస్, లతీఫ్, సుల్తాన్, భాస్కర్, రాములు యాదవ్, ముంత లక్ష్మయ్య యాదవ్, నా గబుచ్చన్న నాయుడు, భాస్కర్ యాదవ్,జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


