POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:22 am Posted by : POLITICAL POWER

విద్యుత్ కార్మిక సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కురసాల జ్యోతికుమార్

అనపర్తి: ఆంధ్రప్రదేశ్ తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం 2026–2028 కాలానికి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలోని అనపర్తి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న కురసాల జ్యోతికుమార్ ఎంపికయ్యారు.
12 జిల్లాలకు సంబంధించి రాష్ట్ర కార్మిక సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జ్యోతికుమార్‌ను ఎంపిక చేసినట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చ వెంకట రవీంద్ర అధికారికంగా ధ్రువీకరించారు.
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొచ్చ వెంకట రవీంద్రకు జ్యోతికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
జ్యోతికుమార్ ఎంపిక పట్ల విద్యుత్ శాఖ అనపర్తి ఏడీఈ కృష్ణ, వీరభద్రరావు, సంఘం సభ్యులు, తోటి కార్మికులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.