పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక /పిఎన్9 తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి: మద్నూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా మద్నూర్, బిచ్కుంద, డోంగ్లి, జుక్కల్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు సమస్యల గురించి అధికారుల దృష్టి కి తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ -2 నిజామాబాద్ ఛైర్‌పర్సన్ చవాన్ జైవంత్‌రావు ఫైనాన్స్ శ్రీనివాస్ మాట్లాడుతూ టి జి ఎన్ పి డి సి ఎల్ పరిధిలోని హెచ్ టి మరియు ఎల్ టి వినియోగదారుల విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ ఫోరం సిజేఆర్ఎఫ్ 2 విద్యుత్ సరఫరా లో ఎలాంటి సేవలోపం ఉన్న ఫారమునకు ఫిర్యాదు చేయవచ్చని మీ ఫిర్యాదు రాత పూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబర్ మరియు మీ యొక్క పూర్తి చిరునామాతో పోస్ట్ ద్వారా గాని మేలు ద్వారా గాని వ్యక్తిగతంగా గాని వాట్సాప్ గాని ఆఫీసు కు పంపగలరు ఎలాంటి రుసుములు చెల్లించనక్కర్లేదు ఫిర్యాదు చేయుటకు వకీల్ కు కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఫిర్యాదుదారుల నుంచి మరిఅంత వివరములు తెలుసుకొనుటకు అవసరమైన యేడల ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్యల పరిష్కారానికి కావలసిన వివరములు సేకరిస్తారు. విద్యుత్ సరఫరాలో గాని వంగిన పోల్స్ రైతులకు గాని లబ్ధిదారులకు గాని ఏ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ఉందని మండల ఏ ఇ లకు లైన్మెన్ల కు సూచనలు సలహాలు ఇచ్చారు. రైతులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అతి తొందరలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. బోర్డు పైన పేర్లు రాసి డిస్ప్లే పైన పెడతాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలాల ఏఇలు లైన్మెన్లు విద్యుత్ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు.