వినాయకుని కొలువుతో మార్మోగుతున్న వీధులు.
లంబోదరుడి రాకతో పల్లెపల్లెనా పండుగ వాతావరణం. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న జనసందోహం.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగుదీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లామదనాపురం మండలం తీర్మలాయపల్లి గ్రామంలో వాడవాడలా వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. గణనాథుడి ప్రతిమలను ప్రతిష్ఠించిన భక్తులు ప్రత్యేక పూజలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. వీధి వీధినా ప్రతిష్టించిన బొజ్జ గణపయ్య కొలువుదీరడంతో వేదమంత్రాలు, భక్తి గీతాల...