POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 7:29 pm Posted by : POLITICAL POWER

వినాయకుని నవరాత్రి పూజలు అందుకున్న.లడ్డును వేలం పాటలో 29,516లకు దక్కించుకున్న మాజీ కాంగ్రెస్.మండల.అధ్యక్షులు.కోటగిరి స్వర్ణలత-సతీష్ దంపతులు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఎల్ల స్వామి గౌడ్ టేకుమట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల.మండలంలోని ఎంపేడు గ్రామంలో ‘శ్రీ విఘ్నేశ్వర యూత్’ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోశమ్మ గుడి వద్ద ఘనంగా నిర్వహించిన వినాయకుని లడ్డు వేలంపాటలో గ్రామానికి చెందిన కోటగిరి స్వర్ణలత-సతీష్ గౌడ్ దంపతులు 29,516/- లకు గణపతి ప్రసాదాన్ని (లడ్డును) కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ… ఆ విఘ్నేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంపేడు గ్రామ ప్రజలతో పాటు మండల ప్రజలందరూ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో, పిల్లాపాపలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… వర్తమాన ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారునికి అందేలా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ రావు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూ మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భారీ మెజారిటీతో గెలుపొంది, ప్రజా ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ వేలంపాట మరియు వినాయక ఉత్సవ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.