వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో!
అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని వ్యాపారులు, షాపుల యజమానులు, వినాయక ఉత్సవ నిర్వాహకులు, డీజే నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పండుగ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్స్ వినియోగంపై పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల...