POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 4:40 pm Posted by : POLITICAL POWER

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి 

–పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్నదానం,

పొలిటికల్  పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ న్యూస్  వనపర్తి జిల్లా బ్యూరో  యస్.  ఈశ్వర్. సెప్టెంబర్. 16. 2026.వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలతో పాటు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన మరియు సురక్షిత వాతావరణంలో నిర్వహించుకొంటూ పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లాఎస్పీ. సునితరెడ్డిఐపీఎస్.అన్నారు. మంగళవారం  వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలోనిసాయుధదళపోలీసుకార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథునికి ఉత్సవాల్లో రెండవ రోజు అన్నదాన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  సునిత రెడ్డి, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభింఅనంతరం ఎస్పీ.  పోలీసు సిబ్బందితో కలిసి అన్నదాన కార్యక్రమం లో పాల్గొని భక్తులకు, సిబ్బందికి అన్నప్రసాదాన్ని వడ్డించి . పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పరస్పరం సహకరించుకుంటూ ఐకమత్యం, సమన్వయం,అంకితభావంతోవిధులునిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలోప్రతిఒక్కరూబాధ్యతగావ్యవహరించాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజలకు నమ్మకమైన పోలీసింగ్ అందించడమే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారి సమస్యలను సానుభూతితో విని, తక్షణమే స్పందించేలా ప్రతి పోలీసుఅధికారి,సిబ్బందిపనిచేయాలనిసూచించారు. జిల్లా ప్రజలందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో జరుపుకోవాలని ఎస్పీ  కోరారు. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను పాటిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలసహకారంతోనే పండుగలనుమరింతప్రశాంతంగా,ఆనందోత్సాహాలతోనిర్వహించుకోవచ్చని, భక్తి, భద్రత, బాధ్యతతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేద్దామని ఎస్పీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, వనపర్తి సీఐ, సుగంధరత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్,స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, పర్వతాలు, సీసీఎస్ ఎస్సై, వెంకటేశ్వర్లు, డిసీఆర్భి ఎస్సై, తిరుపతి రెడ్డి, రిజర్వ్ సబ్‌ఇన్స్పెక్టర్లు, వినోద్, మగ్దూం బారీ, ట్రాఫిక్ ఎస్సై సురేందర్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, గోవింద్, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.