

వినాయక మండపాన్ని సందర్శించినశుక్రవారం రోజు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామం మూడో వార్డు నందు వడ్డెర యువసేన ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు తోలేటి శ్రీకాంత్….
పొలిటికల్ పవర్ ప్రతినిధి: విజయవాడ రూరల్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యతకు భక్తి భావానికి ప్రతీకైనా శ్రీ గణపతి ఉత్సవాలు వాడవాడలా జరుపుకోవడం చాలా సంతోషం అన్నారు ముఖ్యంగా వడ్డెర యువసేన యువకులు చాలా భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించడం వారికి అభినందనలు తెలిపారు ఈరోజు ఊరేగింపు సందర్భంగా పలువురికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో వడ్డెర యువసేన ఆర్గనైజర్లు ఏర్ల బాలు, తమ్మిశెట్టి సుబ్బలక్ష్మి,వేముల శివగోపి, బండి శివ, ఎర్ల నవీన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం చేతివృత్తల విబాగం అధ్యక్షులు జవ్వాది సుధీర్, బీసీ నాయకులు
ముండురి సత్యవతి, ఇందిరా జామి కేశవ చింతలూరి మోహన్రావు తదితరులు పాల్గొన్నారు