– పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి,
– డీజేలు, అధిక శబ్దంతో కూడిన లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదు,ఆన్‌లైన్‌లో వివరాల నమోదు కోసం :https://policeportal.tspolice.gov.in,
పొలిటికల్ పవర్ సమగ్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14.2026.ఈ నెల 14వ తేదీ సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వనపర్తి జిల్లా పరిధిలో గణేష్ మండపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుశాఖకు సమాచారం అందించి అనుమతి పొంది భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసుశాఖ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.ఈhttps://policeportal.tspolice.gov.in ఆన్లైన్ లింక్ ను క్లిక్ చేసి అందులో దరఖాస్తు దారుని వివరాలు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, విగ్రహం ఏర్పాటు చేస్తున్న మండపం ఎత్తు, కమిటీ సభ్యులు పేర్లు వారి ఫోన్ నెంబర్లు, విగ్రహం ప్రతిష్టించే రోజు, నిమజ్జనం చేసే తేదీ సమయం, ప్రదేశం, ఆ ప్రదేశానికి ఏ వాహనంలో చేరుకుంటారు, అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగానమోదుచేయాలనిసూచించారు. వనపర్తి జిల్లాలోని పట్టణాలలో మరియు గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వహకులు ఈ వెబ్సైట్,నందువివరాలను పొందుపరచాలనిసూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాలు కాని సందర్భంలో దగ్గర్లో ఉన్న పోలీస్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిష్టాపనకు ప్రాధాన్యత కేటాయించాలని తెలిపారు. గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి. గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ మండపంలో 24 గంటలు ఇద్దరు వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి. గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.మండపాల దగ్గర విధిగాపాయింట్,పుస్తకంఏర్పాటుచేసుకోవాలి,పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.ఎట్టి పరిస్థితులలోనూ పెద్ద శబ్దాలతో కూడిన లౌడ్ స్పీకర్స్, డి.జె. లకు అనుమతి లేదని అన్నారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా పోలీసు యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని వెంటనే డయల్ 100 లేదా 112 కు సంప్రదించాలని ఎస్పీ. తెలిపారు.


