POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:40 pm Posted by : POLITICAL POWER

విబి-జి రామ్ జి ఉద్యోగుల సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుంది: డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: నపర్తి జిల్లాలోని అన్ని మండలాల విక్షత్ భారత్–రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ (గ్రామీణ్) గ్యారంటీ (VB-G RAM G) ఉద్యోగుల సమస్యలను ప్రజా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. పెండింగ్ వేతనాలను తక్షణమే విడుదల చేయడం, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు, పదోన్నతులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీ అమలు, ఒకే పే స్కేల్ వంటి డిమాండ్లతో ఉద్యోగులు డాక్టర్ చిన్నారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ చిన్నారెడ్డి రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ దివ్య తో పాటు సీఎంఓ కార్యాలయ అధికారి శ్రీధర్ తో ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, ముఖ్యంగా పెండింగ్ వేతనాల విడుదల, క్యాడర్ స్ట్రెంత్, పదోన్నతులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ విధానాల అమలుపై చర్యలు తీసుకునే దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. అలాగే ఒకే పే స్కేల్ అమలు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగుల డిమాండ్ పరిష్కారానికి కృషి చేస్తానని డాక్టర్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్‌లో ఐకేపీ ఉద్యోగులు, VB-G RAM G ఉద్యోగులు రెండు కళ్లలాంటివారని, ఐకేపీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేసి వీరికి ఇవ్వకపోవడం సమంజసం కాదని పేర్కొంటూ తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా జేఏసీ కన్వీనర్ బాలయ్య, కో-కన్వీనర్ కోళ్ల సత్తన్న, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, ఉద్యోగులు భాస్కర్, రామస్వామి, ముఖీద్‌తో పాటు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన APOలు, ECలు, TAలు, BFTలు, COలు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.