విమర్శనాత్మక వార్తలపై జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు సరికాదు..
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ న్యూడిల్లీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జర్నలిస్టులు వార్తలు లేదా కథనాలు రాశారనే కారణంతో వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛను గౌరవించాలని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) కింద జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కేవలం ఒక జర్నలిస్టు రాసిన కథనం ప్రభుత్వంపై విమర్శగా కనిపించిందనే కారణంతో అతనిపై క్రిమినల్...