వనపర్తిలో పోస్టర్ ఆవిష్కరించిన పలుస శంకర్ గౌడ్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 2026: ప్రజా గాయని విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 50 గంటల ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ తెలిపారు. జాతర పోస్టర్‌ను బుధవారం వనపర్తిలో ఆయన ఆవిష్కరించారు.
కార్యక్రమ వివరాలు: 📅 తేదీలు: సెప్టెంబర్ 26, 27, 28 వేదిక: హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపం, అరుణోదయ నాగన్న ప్రాంగణం సెప్టెంబర్ 26 ఉదయం 9 గంటలకు: సుందరయ్య పార్క్ నుంచి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు డోరేగింపు ఉదయం 9.45 గంటలకు: జెండా ఆవిష్కరణతో జాతర ప్రారంభం తెలుగు రాష్ట్రాలతో పాటు 8 రాష్ట్రాల నుంచి వందలాది కళాకారులు పాల్గొని కళా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు శంకర్ గౌడ్ తెలిపారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 52 ఏళ్ల పోరాట చరిత్ర, విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానాన్ని యువతరానికి పరిచయం చేయడమే జాతర లక్ష్యమన్నారు. వనపర్తి జిల్లా నుంచి కళాకారులు, సాహితీవేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో కవి బైరోజు చంద్రశేఖర్, డాక్టర్ శాం సుందర్, గంధం నాగరాజు, బండారు శ్రీనివాస్, దేశి రాములు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.